15, డిసెంబర్ 2010, బుధవారం

పరమవీరచక్ర!

పరమవీరచక్ర పేరు పెట్టుకునేందుకు ముందు ఒక్కసారైనా ఆ బిరుదుయొక్క గొప్పదనం గురించి తెలుసుకున్నారా..? రేపు ఆ సినిమా హిట్టు ఐతే బాలక్రిష్ణని పరమవీరచక్ర బాలక్రిష్ణ అని పిలవాలా..? లేదా ఆ సినిమా పోతే పరమవీరచక్ర పరమచెత్త అని చెప్పుకుంటుంటే వినాలా? ఒక సినిమాకి అనుమతి ఇచ్చే ముందు సెన్సారు వారు దయచేసి నిద్రలో నుండి బయటపడితే ప్రేక్షక లోకాన్ని రక్షించిన వారు అవుతారు..

యుద్ధంలో వీరోచితంగా పొరాడి ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారికి, వీరు నా బిడ్డలు అని భరతమాత గర్వంగా చెప్పుకునే వీర కిషొరాలకు ఇచ్చే బిరుదు అది..

అటువంటి గొప్ప బిరుదుని ఒక సామాన్య నటుని సినిమాకి పెడుతుంటే రేపు యావత్ భారతావనికి మన తెలుగువారు జవాబు చెప్పుకొవాల్సిన దుస్థితి కాదా.. ఇక వరుసగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి బిరుదులను సినిమా వాళ్ళు తగిలించుకుంటే ఇక వాటికి విలున ఏముంది..? నిజానికి అన్నగారే ఉంటే తప్పనిసరిగా పేరు గురించి మరొకసారి అలోచించమనే వారు..

చివరిగా ఒక మాట... ఈ సినిమా చూసి క్షేమంగా బయటకు వచ్చిన వారికి ఆ బిరుదు ఇస్తామంటే మాత్రం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి